తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత ఎంత శాతమంటే..?

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత ఎంత శాతమంటే..?

హైదరాబాద్: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మాసాబ్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం (మే 29) ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ బాలక్రిష్ణ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్‎లో మొత్తం 16,726 మంది అభ్యర్థులు (93.60 శాతం) క్వాలిఫై అయ్యారు. 

ఈ సందర్భంగా బాలక్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. జూలై మొదటి వారంలో క్లాసెస్ ప్రారంభం అవుతాయని తెలిపారు. ఫీజులు గత ఏడాది మాదిరిగానే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొలుగారం, ఈసెట్ కన్వీనర్ ప్రొ.చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

కాగా, పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా సెకండియర్ (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ ఎగ్జామ్ 2026, మే 15న నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,626 మంది అభ్యర్థులు ఈసెట్‎కు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 17,870 (95.94%) మంది ఎగ్జామ్ రాశారు. 

ALSO READ : సరైన నిఘా ఉండి ఉంటే..

హైదరాబాద్ రీజియన్‌‌‌‌లోని 36 సెంటర్లలో 12,038 మందికి గానూ 11,467 (95.25%) మంది హాజరుకాగా, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న 40 సెంటర్లలో 6,588 మందికి గానూ 6,403 (97.19%) మంది పరీక్ష రాశారు. హైదరాబాద్ కంటే జిల్లాల్లోనే హాజరు శాతం ఎక్కువగా నమోదైంది.