
హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలోని పలు అంశాలపై చర్చించేందుకు ఎడ్యుకేషన్ కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం భేటీ కానున్నది. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉదయం 10గంటలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనున్నది.
ALSO READ :ఉమ్మడి పౌర స్మృతిపై తప్పుడు వ్యాఖ్యానాలొద్దు
దీనిలో మన ఊరు మన బడి పథకం అమలు, స్కూల్ ఫీజులు, టెట్, టీఆర్టీ, యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్, ప్రైవేటు వర్సిటీలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే, కేబినేట్ సబ్ కమిటీలో మంత్రలు కేటీఆర్, హారీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి ఈఈదయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు మంత్రులున్నారు.