- డైట్ కాలేజీల్లో 53% పోస్టులు ఖాళీ
- సమగ్ర శిక్ష పీఏబీ నివేదికలో కేంద్రం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. సర్కారు స్కూళ్లలో టీచర్ల కొరత అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన సమగ్ర శిక్ష పీఏబీ నివేదిక రాష్ట్ర విద్యా వ్యవస్థలోని ఎన్నో అంశాలను బహి ర్గతం చేసింది. ఈ విద్యాసంవత్సరానికి పీఏబీ మొత్తం రూ.1.763.70 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 30,057 ప్రభుత్వ బడులు (69.7 శాతం) ఉండగా, వాటిలో చదువుతున్నది 26.29 లక్షల (35.3 శాతం) స్టూడెంట్స్ మాత్రమే, దీనికి భిన్నంగా, 12,474 (28.9 శాతం) ఉన్న ప్రైవేటు స్కూళ్లలో 47.52 లక్షల (63.7 శాతం) మంది చదు వుతుండటం గమనార్హం. స్టేట్లో 4,739 ప్రైమరీ స్కూళ్లు ఒక్క టీచర్ తోనే కొనసాగుతున్నాయి.
ఇది మొత్తం ప్రైమరీ స్కూళ్లలో 24 శాతం. అప్పర్ప్రైమరీలె వల్లోనూ సింగిల్ టీచర్ బడుల సంఖ్య 80 నుంచి 93కి పెరిగింది. దీంతో బోధన నాణ్యత తగ్గుతుంది. విద్యార్ధి. ఉపాధ్యాయ నిష్పత్తి కూడా అస్తవ్యస్తంగా ఉంది. అప్పర్ ప్రైమరీలో పీటీఆర్ 14.8 నుంచి 18.6 శాతానికి పెరిగింది. మరోపక్క విద్యార్ధులు లేక బడులు వెలవె లబోతున్నాయి. ఏకంగా 11,801 ప్రైమరీ స్కూళ్లలో (60%) 30 కంటే తక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. టీచర్ల సంఖ్య ప్రైవేటులోనే ఎక్కువగా ఉంది. ప్రైవేటు 55 1.99.734 ລ້ ໖ (55.8%) ໐໕... ప్రభుత్వంలో 1,54,956 మంది (43.3%) మాత్రమే ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఒక్క విద్యార్థి కూడా లేని జీరో ఎనో రోల్మెంట్ ఐదుల సంఖ్యకూడా 1,809 నుంచి 1.997కు పెరిగింది. అప్పర్ ప్రైమరీలోనూ జీరో ఎన్ రోల్ మెంట్ బడుల సంఖ్య 39 నుంచి 49కి చేరింది. స్టేట్ వైడ్గా 6,791 ప్రైమరీ స్కూళ్లలో 15 మంది కంటే తక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారు.
పెరుగుతున్న డ్రాపౌట్ రేట్
బడి మారుతున్న కొద్దీ విద్యార్థులు చదువుకు దూర మవుతున్నారు. సెకండరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు గతేడాది 8% ఉండగా, ఇప్పుడు 10.5%కి పెరిగింది. ఇది జాతీయ సగటు 8.2% కంటే ఎక్కువ. బడుల్లో వసతుల విషయంలో నీళ్లు, కరెంటు లాంటి సదుపా యాలు 95 శాతానికి పైగా బడుల్లో కల్పించినా, నాణ్య మైన విద్య అందించడంలో మాత్రం రాష్ట్రం వెనుకబడే ఉందని నివేదిక ఎత్తిచూపింది. ఓవైపు బడుల్లో సౌక ర్యాలు లేవని అంటుంటే.. మరోవైపు కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలోనూ రాష్ట్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రం వద్ద ఏకంగా రూ.163.04 కోట్ల నిధులు నిరుపయోగం గా ఉన్నాయని పీఏబీ నివేదికలో వెల్లడించింది. పాత నిధులు ఖర్చు చేయకుండా కొత్తగా నిధులు కేటాయిం చడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. 2018 నుంచి 2021 మధ్య మంజూరైన పనులు ఇంకా అసం పూర్తిగానే ఉన్నాయని పనుల పురోగతిని ప్రబంద్ పోర్ట ల్లో అప్డేట్ చేయడం లేదని పేర్కొన్నది.
టీచర్ల శిక్షణ కేంద్రాలూ ఖాళీనే..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 డైట్ కాలేజీల్లో మంజూరైన 286 పోస్టుల్లో ఏకంగా 151 పోస్టులు ఖాళీగా ఉన్నా యని నివేదిక పేర్కొంది. అంటే 53 శాతం కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల ఖాళీలను భర్తీ చే యకపోవడం. ఉన్న టీచర్లకు సరైన శిక్షణ లేకపోవడం తోనే విద్యార్థుల అభ్యసన సామర్థ్యం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది.
