పోడు భూములకు పట్టాలు ఇవ్వండి...సీఎంను కోరిన గిరిజన ఎమ్మెల్యేలు

పోడు భూములకు పట్టాలు ఇవ్వండి...సీఎంను కోరిన గిరిజన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడంతోపాటు 'ఇందిర గిరిజన జల వికాసం' పథకాన్ని తక్షణమే అమలు చేయాలని గిరిజన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. 

ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై పలు అంశాలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ వరకు అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.