రైల్వే పార్సిల్స్‌‌‌‌పై పోలీస్‌‌‌‌ నిఘా

రైల్వే పార్సిల్స్‌‌‌‌పై పోలీస్‌‌‌‌ నిఘా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రైల్వే పార్సిల్స్‌‌‌‌పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు ఢిల్లీ, ముంబై నుంచి రైళ్ల ద్వారా భారీగా గిఫ్ట్‌‌‌‌లు రాష్ట్రానికి తెస్తున్నారు. కుక్కర్స్‌‌‌‌తో పాటు ఇతర విలువైన వస్తువులను హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నారు.  

రోడ్డు మార్గాల్లో ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేస్తే పోలీస్ చెకింగ్స్‌‌‌‌లో దొరికే చాన్స్ ఉండటంతో..బస్సులు, ఇతర వాహనాలు కాకుండా రైళ్లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రైల్వే పార్సిల్స్‌‌‌‌ ద్వారా రవాణా చేస్తున్నారు. గత వారం ఢిల్లీ నుంచి భద్రాచలం తరలిస్తున్న రూ.4.80లక్షలు విలువ చేసే 2400 హ్యాండ్ బ్యాగ్‌‌‌‌లను వరంగల్‌‌‌‌ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, కుక్కర్లు, బ్యాగ్స్ వంటి గిఫ్ట్‌‌‌‌లు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్‌‌‌‌, జీఆర్‌‌‌‌‌‌‌‌పీ ఆఫీసర్లతో  డీజీపీ అంజనీకుమార్‌‌‌‌ పలుమార్లు సమీక్ష నిర్వహించారు. రైళ్లలోనూ  పటిష్టమైన తనిఖీలు చేయాలని ఆదేశించారు.