హైకోర్టు స్టే పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైకోర్టు స్టే పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే విధించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ముందుకెళ్తామని చెప్పింది. ఈ మేరకు సింగిల్ లైన్ తో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎన్నికల కమిషన్.

 స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం  రిజర్వేషన్లు కేటాయిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి నాలుగు వారాల గడువునిచ్చింది కోర్టు.

 42 శాతం కోటాతోనే స్థానిక ఎన్నికలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్  ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం.  దీంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలోనే స్పందించిన  రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపింది.