లోకల్ పోలీసుల బదిలీలపై..ఎన్నికల కమిషన్ నజర్

లోకల్ పోలీసుల బదిలీలపై..ఎన్నికల కమిషన్ నజర్
  • పోలీస్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లలో చక్రం తిప్పిన పొలిటికల్ లీడర్లు
  • సీఐ, ఎస్సైలుగా తమ వారినే నియమించుకునేలా ఒత్తిడి
  • రాజకీయ పలుకుబడితో పోస్టింగ్స్ పొందిన వారి డేటా సేకరిస్తున్న ఇంటెలిజెన్స్, ఎస్​బీ
  • వారం రోజుల్లో మరి కొందరు ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యే చాన్స్!

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుతో పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ పొందిన పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్ ఫోకస్ పెట్టింది. డీఎస్పీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు ఇటీవల జరిగిన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్‌‌‌‌‌‌‌‌పై రిపోర్టులను సేకరిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకే చోట మూడేండ్లు విధులు పూర్తి చేసిన వారిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో భారీగా  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్ అయ్యాయి. మే నెల నుంచి ఆగస్టు వరకు అన్ని స్థాయిల అధికారులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు.

 లోకల్‌‌‌‌‌‌‌‌ లీడర్స్ మార్క్‌‌‌‌‌‌‌‌

ఈసీ ఆదేశాలతో రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు జరిగాయి. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా163 మంది సీఐలను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తూ అప్పటి సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే గ్రేటర్​లోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీలు, సీఐ, ఎస్సైల బదిలీలు భారీగా జరిగాయి. అయితే, ఈ బదిలీల తర్వాత అధికార పార్టీ  నేతలు చక్రం తిప్పినట్లు ఆరోపణలున్నాయి.

తమకు అనుకూలంగా ఉన్న వారికి నచ్చిన ప్లేస్​లో పోస్టింగ్స్ దక్కేలా పోలీస్ ఉన్నతాధికారులపై నేతలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.  ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ల బదిలీల్లో స్థానిక మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి మంచి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో పోస్టింగ్స్ వచ్చినట్లు సమాచారం.

గంటల్లోనే మార్పు..

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ ఇష్యూ అయిన కూడా స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడితో గంటల వ్యవధిలోనే ఆర్డర్స్ మారిపోయిన ఘటనలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న పోలీసులకు నచ్చిన ప్లేస్‌‌‌‌‌‌‌‌లో పోస్టింగ్స్ ఇప్పించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని ప్లాన్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా రాజకీయ పలుకుబడితో పోస్టింగ్స్ పొందిన వారిపై ఈసీ ఫోకస్ పెట్టింది. వారి వివరాలను ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ల వారీగా  సేకరిస్తున్నట్లు సమాచారం.

ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యారు. గతంలో విధులు నిర్వహించిన పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో సీఐ, ఎస్సైల ట్రాక్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ సహా సంబంధిత వివరాలతో కూడిన నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో హైదరాబాద్ లో మరికొందరు ఇన్ స్పెక్టర్లు బదిలీ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం.