
హైదరాబాద్, వెలుగు: సకల జనుల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు పోరాడకుండానే రాష్ట్రం ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాలనలోకి కేసీఆర్ కుటుంబ రాజకీయాలను తీసుకొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.