
హైదరాబాద్, వెలుగు: గోషామహల్ నియోజకవర్గంలో గతంలో రిగ్గింగ్ జరిగిందని.. ఈసారి అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కోరారు. బుధవారం ఆయన సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలన్నింటి వద్ద సీసీటీవీ, పోలీస్, సెంట్రల్ ఫోర్సెస్ ఉంచాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
కొంతమంది పోలీసు ఆఫీసర్లు బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్ ల్లోకి వెళ్లేవారు తమ ఐడీ కార్డులను చూపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు గోషామహల్ లో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.