
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఎంసెట్ ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయి. ఉదయం 9.30గంటలకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎంసెట్ అధికారులు దీన్ కుమార్, విజయకుమార్ రెడ్డి తాజాగా వెల్లడించారు.
మాసబ్ ట్యాంకులోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. రేపు పాలిసెట్ ఫలితాలు పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన పాలిసెట్ –2023 ఫలితాలు శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఎస్బీ టెట్ ఆఫీసులో ఫలితాలు విడుదల చేయనున్నామని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.