కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లెటర్

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లెటర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ జ్యూరిస్‌‌‌‌‌‌‌‌డిక్షన్‌‌‌‌‌‌‌‌లోని రెండో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ నుంచి జూరాల ప్రాజెక్టును తప్పించాలని తెలంగాణ కోరింది. ఈ మేరకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ(జనరల్‌‌‌‌‌‌‌‌) మురళీధర్‌‌‌‌‌‌‌‌ మంగళవారం కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎంపీ సింగ్‌‌‌‌‌‌‌‌కు లెటర్​రాశారు. జూరాల పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు అని, దీనికి ఏపీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం జులై15న జారీ చేసిన గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో నెట్టెంపాడు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీంను రెండు కాంపోనెంట్లుగా పేర్కొన్నారని, దాన్ని ఒక కాంపోనెంట్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని కోరారు. నెట్టెంపాడు ఎత్తిపోతలు చేపట్టిందే 3.4 టీఎంసీల నీటిని తీసుకునేందుకని, దాన్ని విస్తరించాలనేది నిజం కాదన్నారు. ఉమ్మడి ఏపీ ఆవిర్భావానికి ముందు మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరు అందించడానికి భీమా(100.7 టీఎంసీలు), అప్పర్‌‌‌‌‌‌‌‌ కృష్ణా(54.4 టీఎంసీలు), తుంగభద్ర లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌(19.2 టీఎంసీలు) ప్రాజెక్టులను ప్రతిపాదించారని గుర్తు చేశారు. మొత్తం174.3 టీఎంసీలతో 7 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సిన ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీ ఆవిర్భావంతో పక్కకు పోయాయని వివరించారు. వాటిని చేపట్టకనే తాము ఎత్తిపోతల పథకాలు నిర్మించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

మూడో షెడ్యూల్​కు మార్చండి
తెలంగాణ తొలి దశ ఉద్యమంతో జూరాల ప్రాజెక్టును 33 టీఎంసీలతో ప్రతిపాదించారని ఈఎన్సీ మురళీధర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ప్రస్తుత జూరాల ప్రాజెక్టుకు 9.75 కి.మీ.ల దిగువన నిర్మించాల్సిన దాన్ని ఎగువకు తీసుకెళ్లడంతో నీటి నిల్వ సామర్థ్యం11 టీఎంసీలకు తగ్గిపోయిందన్నారు. జూరాల ప్రాజెక్టు స్టేజ్‌‌‌‌‌‌‌‌1లో 23 టీఎంసీలు గ్రావిటీ ద్వారా, స్టేజీ -2లో 28.8 టీఎంసీలు తీసుకోవాల్సి ఉందని, ఇదే విషయాన్ని బచావత్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌కు నివేదించినట్లు గుర్తు చేశారు. జూరాల ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అన్ని ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలని తాము బ్రజేశ్‌‌‌‌‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఎదుట వాదనలు వినిపిస్తున్నామన్నారు. కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌కు నీళ్లు ఇచ్చే, ఏపీ భూభాగంతో సంబంధం లేని జూరాల ప్రాజెక్టును గెజిట్‌‌‌‌‌‌‌‌లోని రెండో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ నుంచి మూడో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌కు మార్చడానికి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.