తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్  విడుదల అయ్యింది.  జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం  మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ జరగనుంది.   జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా..  జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 19 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ జరనుండగా.. జులై 24న రెండో విడత సీట్లు కేటాయిస్తారు.  జులై 30 నుంచి  తుది విడత కౌన్సెలింగ్ జరగనుండగా..  ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ALSO READ | టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల

మే 18న ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ రిజల్ట్ రిలీజ్ అయ్యాయి.  ఎప్ సెట్ పరీక్షకు 3 లక్షల 31 వేల 251 మంది విద్యార్థులు హాజరవ్వగా.. ఇందులో 2 లక్షల 40 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కు అప్లై చేశారు.

ఎప్ సెట్ టాపర్స్ (Engineering)

1st rank - సతివాడ జ్యోతిరాదిత్య
శ్రీకాకుళం అంధ్రప్రదేశ్ 

2nd rank - గొల్ల లేక హర్ష
కర్నూల్ అంధ్రప్రదేశ్ 

3rd rank - రిషి శేఖర్ శుక్ల

ఇంజనీరింగ్ లో టాప్ టెన్ లో ఒక్క అమ్మాయి మాత్రమే

10 th rank - ధనుకొండ శ్రీనిధి
విజయనగరం అంధ్రప్రదేశ్