పోలవరం నుంచి లింక్‌‌ చేయడమే బెటర్‌‌

పోలవరం నుంచి లింక్‌‌ చేయడమే బెటర్‌‌
  • పులిచింతల ద్వారా నాగార్జున  సాగర్ కు
  • గోదావరి–కృష్ణా లింక్‌‌పై ఇంజనీర్లు

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి – కృష్ణా బేసిన్‌‌ల లింక్‌‌పై శనివారం తెలంగాణ ఇంజనీర్లు భేటీ అయ్యారు. ఈఎన్సీ మురళీధర్‌‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎక్కడి నుంచి నీళ్లను తరలిస్తే మంచిదనే విషయంపై చర్చించారు. పోలవరం నుంచి ప్రాజెక్టు కాలువను ఉపయోగించి.. పులిచింతల ద్వారా నాగార్జున సాగర్‌‌కు.. అక్కడి నుంచి కృష్ణా నదిని ఉపయోగించుకొని శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయడమే మంచిదని నిర్ణయించారు. ఈ లింక్ ప్రతిపాదన తెలంగాణకు మంచిదని, ప్రస్తుత పరిస్థితుల్లో వయబుల్‌‌ అలైన్‌‌మెంట్‌‌ కూడా ఇదేనని తెలిపారు. రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లతో ఈ లింక్‌‌ పనులు చేయవచ్చని అంచనా వేశారు. ఈ నెల 24న తెలంగాణ, ఏపీ సీఎంలు భేటీ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంజనీర్లు సమావేశమయ్యారు. అలైన్‌‌మెంట్‌‌ ప్రపోజల్‌‌ రెడీ చేశామని.. సీఎంవో ఆదేశిస్తే సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంజనీర్లు చెప్పారు. దుమ్ముగూడెం, ఇచ్చంపల్లిలో ఎక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలన్నా భారీ ఎత్తున భూమిని సేకరించాల్సి ఉంటుందన్నారు.