
హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( ఎల్ఆర్ఎస్ ) గడువును ప్రభుత్వం మరో సారి పొడిగించింది . ఈ నెల 31 వరకు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి సోమవారం జీవో జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ కూడా ఈ నెల చివరి వరకు వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు.
గడువు పెంచాలని ఈ నెల 3నే మున్సిపల్ శాఖ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయగా.. తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 4 నుంచే ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 7 లక్షల మంది ఫీజు చెల్లించారని, రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు.