- బ్రిటన్డిప్యూటీ ట్రేడ్కమిషనర్ చంద్రు కె. అయ్యర్‌తో సమావేశం
హైదరాబాద్, వెలుగు: భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)తో రాష్ట్రానికి ఎక్కువ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీ, ఇండస్ట్రీస్శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై బ్రిటన్సుంకాలు తొలగించిందని గుర్తు చేశారు.
బ్రిటన్కు ఎగుమతులు పెంచుతామన్నారు. గురువారం ఆయన బ్రిటన్డిప్యూటీ ట్రేడ్కమిషనర్ చంద్రు కె. అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధులతో సెక్రటేరియెట్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సీఈటీఏతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు దేశాల మధ్య రూ.3.25 లక్షల కోట్ల వాణిజ్యం జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణలో పారిశ్రామిక వస్తు ఉత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ, సెమీకండక్టర్స్, చిప్ ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేశామని, బ్రిటన్ పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలని కోరారు.
బ్రిటన్కు 3,553 కోట్ల ఎగుమతులు
రాష్ట్రం నుంచి బ్రిటన్కు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొత్త ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాల వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడిందని వివరించారు. దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణలోనే జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుత్లో 30 శాతం రాష్ట్రానిదేనని వెల్లడించారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గుర్తు చేశారు.
హైదరాబాద్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు 450 జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేశాయని చెప్పారు. బ్రిటన్కు ఎగుమతి చేయగలిగే వస్తువుల తయారీపై స్థానిక పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి సీఈటీఏతో వచ్చే ప్రయోజనాలను వివరించాలని ఇండస్ట్రీస్ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు శ్రీధర్ బాబు సూచించారు.
