ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించండి : రైతు కమిషన్

ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించండి : రైతు కమిషన్
  •     ప్రభుత్వానికి రైతు కమిషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను పునరుద్ధరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు లేఖ రాశారు. గ్రామ స్థాయిలో రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆదర్శ రైతులు పనిచేస్తారని, వ్యవసాయ అధికారులకు సహాయకంగా ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని లేఖలో తెలిపారు. 

ఈ వ్యవస్థ పునరుద్ధరణతో ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని తెలిపింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి శేషాద్రిని కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్ కలిశారు. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.