V6 News

తెలంగాణ ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్: ఉదయం 11 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే..?

తెలంగాణ ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్: ఉదయం 11 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాగా ఓటర్లు పోలింగ్ బూత్‎ల బాటపట్టారు. దీంతో పంచాతీయ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా నమోదు అవుతోంది. ఉదయం 11 గంటల వరకు దాదాపు 45 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం.

 మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.