పద్మారావునగర్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
దీక్షా దివస్ను పురస్కరించుకుని మంగళవారం నిమ్స్ హాస్పిటల్ లో ఆయన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ సిద్ధించేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
కంటోన్మెంట్లో..
విజయ్ దివస్ సందర్భంగా కంటోన్మెంట్ అన్నానగర్, బోయిన్పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేశారు. బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

