V6 News

సిద్ధిపేట జిల్లాలో 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

సిద్ధిపేట జిల్లాలో 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు షాకిచ్చారు. ఒకేసారి 182 మంది ఎంప్లాయ్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు హాజరు కానందున సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
సిద్ధిపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి. అయినప్పటికీ 182 మంది ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

సిద్దిపేట ‌డివిజన్‌‌ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. ఏడు మండలాల్లో మొత్తం 88.05 శాతం పోలింగ్‌‌ నమోదైంది. గజ్వేల్‌ ‌డివిజన్‌‌ పరిధిలోని గజ్వేల్‌‌, జగదేవ్‌‌పూర్‌‌, మర్కుక్‌‌, ములుగు, వర్గల్‌‌, సిద్దిపేట డివిజన్ పరిధిలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొత్తం 163  పంచాయతీలకు 16 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 147  గ్రామాలకు ఎన్నికలు నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో మొత్తం 3,834  గ్రామాల్లో పోలింగ్ జరిగింది.  53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు వేయగా.. 84.28% పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్​ రికార్డు అయింది. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం నమోదైంది.