ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. శుక్రవారం (డిసెంబర్ 12) వెస్టిండీస్ పై జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో భారత జట్టు ఐదునుంచి ఆరో స్థానానికి పడిపోయింది. విండీస్ పై విజయంతో కివీస్ నాలుగో స్థానానికి చేరుకుంది. మరోవైపు వెస్టిండీస్ టేబుల్ లో చివరి స్థానములో (9వ స్థానంలో) నిలిచింది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఘోర ఓటమి తర్వాత నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా ఐదో స్థానానికి పడిపోయింది.
సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ముందు మూడో స్థానంలో ఉన్న భారత జట్టు రెండు టెస్టులు ఓడిపోయి క్లీన్ స్వీప్ కావడం వలన రెండు స్థానాలు దిగజారి ఐదో ర్యాంక్ తో సరిపెట్టుకుంది. అయితే తాజాగా కివీస్ విజయంతో గిల్ సేన ఆరో స్థానంలో నిలిచింది. ఇండియా (48.15) పాయింట్ల శాతం 50 శాతం కంటే తక్కువగా ఉంది. పాకిస్థాన్ కూడా నాలుగో స్థానము నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా రెండో స్థానికి చేరుకుంది. తొలి టెస్టుకు ముందు నాలుగో స్థానంలో ఉన్న సఫారీలు టీమిండియాపై 2-0తో విజయం సాధించడంతో 75 శాతం పాయింట్ల శాతంతో టాప్-2కు దూసుకెళ్లారు.
వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా జూలై నెలలో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఇటీవలే యాషెస్ లో తొలి రెండు టెస్టులు గెలిచిన కంగారూల జట్టు 100 శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇంగ్లాండ్ ఏడు, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో విండీస్ జట్టు ఆరు మ్యాచ్ లాడినా బోణీ కొట్టలేదు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. ఆ తర్వాత వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి మూడో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. విండీస్ పై రెండో టెస్టులో విజయం తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. సౌతాఫ్రికాపై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ కావడంతో ఐదో స్థానానికి పడిపోయింది. ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో 9 టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 48.15 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
India slips down to sixth position in the updated WTC points table after New Zealand registered a win against West Indies in Wellington.#WTC2027 pic.twitter.com/qsv3dDf4aX
— CricTracker (@Cricketracker) December 12, 2025

