డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్ తన బెస్ట్ సెల్లర్ డయాబెటిస్ ఔషధం 'ఓజెంపిక్' (Ozempic - సెమాగ్లూటైడ్)ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వయోజనులకు ఈ ఇంజెక్టబుల్ ఔషధం గొప్ప ఉపశమనాన్ని ఇవ్వనుంది. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాల్సిన ఇంజెక్షన్ కావడం దీని ప్రత్యేకత.
స్టార్టింగ్ 0.25 ఎంజీ డోస్ ధర వారానికి రూ.2వేల 200గా నిర్ణయించబడింది. అంటే నెలకు రూ.8వేల 800 కోర్సు ధర. అలాగే 0.50 ఎంజీ డోస్ నెలవారీ నాలుగు ఇంజెక్షన్ల రేటు రూ.10వేల 170గా ఉంది. అలాగే 1 ఎంజీ డోస్ నెల కోర్స్ రేటు రూ.11వేల 175గా కంపెనీ ప్రకటించింది ఇండియా మార్కెట్లో.
ఓజెంపిక్ ఎందుకు అంత స్పెషల్?
భారతదేశంలోని డ్రగ్ రెగ్యులేటర్ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) ఈ సంవత్సరం అక్టోబర్‌లో టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దల కోసం దీని వినియోగాన్ని ఆమోదించింది. రోగులు ఆహారం, వ్యాయామంతో పాటు ఓజెంపిక్ తీసుకోవడం వలన గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుందని తెలుస్తోంది. అలాగే గుండె జబ్బులు ఉన్న టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ప్రధాన కార్డియో వాస్కులార్ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతోంది. ఇది శరీరంలో సహజ హార్మోన్ అయిన GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మాదిరిగా పనిచేస్తుంది.
ఈ మందు రోగుల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు, ఆహారం కడుపు నుండి బయటకు వెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకునేలా చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది.
అయితే ఓజెంపిక్ తీసుకునే రోగులలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, మలబద్ధకం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అలాగే ప్యాంక్రియాస్ వాపు, గాల్ బ్రాడర్ పనితీరు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొందరు రోగుల్లో.

