V6 News

పాక్ ప్రధానికి ఇచ్చి పడేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంతకు మించిన అవమానం ఉండదేమో!

పాక్ ప్రధానికి ఇచ్చి పడేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంతకు మించిన అవమానం ఉండదేమో!

చాలా కాలంగా అమెరికాకు సన్నిహితంగా ఉంటూ.. ఇండియాపై కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్ కు రష్యా బుద్ధి చెప్పింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశపూర్వకంగా చేశాడో లేక అలా జరిగిపోయిందో కానీ.. సోషల్ మీడియలో మాత్రం పాక్ ప్రధానికి సరైన గుణపాఠం చెప్పారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్ దెబ్బకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహనం కోల్పోవాల్సి వచ్చింది. 

శుక్రవారం (డిసెంబర్ 12) తుర్కిమెనిస్తాన్ 30 వార్షికోత్సవం సందర్భంగా.. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు ఘోర పరాభవం ఎదురైంది. తుర్కిమెనిస్తాన్ యానివర్సరీకి హాజరైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను పాక్ ప్రధాని కలవాల్సి ఉంది. కానీ ఈ మీటింగ్ లో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. 
రష్యా అధ్యక్షుడు పుతిన్, తుర్కిష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగన్ తో  ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ సెక్యూరిటీని లెక్క చేయకుండా డోర్ తోసుకుని లోపలికి వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల చర్చల సందర్భంగా జరిగిన ఆలస్యానికి పాక్ ప్రధానికి చిర్రత్తుకొచ్చి డైరెక్టుగా మీటింగ్ హాల్ లోకి వెళ్లిపోయాడు.

పుతిన్, ఎర్డోగన్ మీటింగ్ లో ఉన్న సందర్భంగా.. విదేశీ మంత్రి ఇషాక్ దార్ తో కలిసి 40 నిమిషాలు ఎదురు చూశాడు షహబాజ్. తనను కావాలనే కూర్చోబెట్టారని.. కావాలనే వెయిట్ చేయిస్తున్నారనే సహనంతో లోపలికి వెళ్లిపోయాడు. అప్పటికే చిన్న బుచ్చుకున్న షరీఫ్.. సమావేశంలో కనీసం 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాడు. అవమాన భారంతో వెళ్లిపోయినట్లు ఇంటర్నేషన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. 

పాక్ స్వభావమే అది:

పాక్ ప్రధాని వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పాక్ బుద్ధిని చూపెట్టుకున్నారని మండిపడుతున్నారు. ఇరు దేశాల నేతలు చర్చలో ఉండగా.. డైరెక్టు వెళ్లకూడదనే కామన్ సెన్స్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. బలూచిస్తాన్ లోకి ఎంటరైనట్లు ఇలాంటి సమావేశంలోకి ఎంటరవుతామంటే కుదరని విమర్శిస్తున్నారు. గేట్ క్రాషింగ్.. పాకిస్తాన్ విదేశీ విధానం కొత్త అర్థాన్ని చెప్పింది అంటూ పోస్టులు పెడుతున్నారు.