టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటై ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఒక ఇంటర్వ్యూలో తమ వివాహ జీవితం గురించి, వ్యక్తిగత ఆలోచనల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పెళ్లి తర్వాత తాను ఊహించిన జీవితం, వాస్తవ జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని శోభిత ఎమోషనల్ అయింది..
ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు..
చైతూను పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్ మొత్తం చుట్టేయాలని కలలు కన్నాను. కానీ, సినిమాల షూటింగ్‌లతో నిరంతరం బిజీగా ఉండటం వల్ల ఆ కల నెరవేరలేదు అని శోభితా ధూళిపాళ్ల తెలిపింది. ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పింది. వివాహం తర్వాత దాదాపు 160 రోజులకు పైగా షూటింగ్‌లతో గడిపినట్లు, ఆ రోజుల్లో ఎక్కువ భాగం తమిళనాడులోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. పెళ్లయ్యాక భర్తను విడిచి ఇన్ని రోజులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆమె తెలిపింది.
తమ బిజీ షెడ్యూల్‌లో సమయం ఎలా?
బిజీ షెడ్యూల్స్ మధ్య తమ ఇద్దరి కోసం ఎలా సమయం కేటాయించుకుంటారని అడగగా.. శోభిత ఆసక్తికరంగా బదులిచ్చింది. మనకు ఏదైనా ఒక విషయం నచ్చిందంటే, దానిని ఎలాగైనా సులభంగా సాధిస్తాం. నచ్చకపోతే, అది ఎంత సులభమైన పనైనా కష్టంగా అనిపిస్తుంది. అంటే, తమ బిజీ జీవితంలో కూడా ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలనే కోరిక బలంగా ఉంటే అది సులభంగా సాధ్యమవుతుందని ఆమె పరోక్షంగా చెప్పింది.
తొలి సంవత్సరం అనుభవాన్ని పంచుకుంటూ .. చాలా గొప్పగా, సరదాగా ఉందని శోభిత చెప్పింది.. సినిమా పరిశ్రమ పట్ల నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నా సృజనాత్మకతకు మా కుంటుంబం నుంచి గొప్ప ప్రోత్సాహం లభిస్తోంది అని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రేమ, ఉత్సాహం , సృజనాత్మకత కలగలిసిన చైతూ, శోబితల వైవాహిక ప్రయాణం సినీ వర్గాల్లో ఆదర్శంగా నిలుస్తోందంటున్నారు అభిమానులు.

