బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను నిజామాబాద్ కు పరిమితం అయ్యానని కవిత అన్నారు. తానుఎంపీగా పార్లమెంట్లో ఉంటే ఇక్కడ వీళ్లు పందికొక్కుల్లా దోచుకున్నారని ఆరోపించారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, ఎవరైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. తనను బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టినా వాళ్ల కండ్లు చల్లబడటం లేదన్నారు.
కేటీఆర్ హయాంలో చెరువులను మింగిండ్రు
కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్ మెంట్ పేరుమీద అనేక భూములను మింగేశారని కవిత ఆరోపించారు. చెరుపులు, కుంటలు అగలేదని అన్నారు. ఉస్మాన్ కుంట నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. బీఆర్ఎస్ పేవరేట్ బిల్డర్ వాసవికి భూమి ఇచ్చారని అన్నారు. అందులో ఒక గుంట నక్క, ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్నారు. ఆ ఐఏఎస్ ఇప్పుటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించార నిచెప్పారు. దీనిపై విజిలెన్స్, ఈడీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

