V6 News

ఎన్నికల సిత్రాలు: ఊళ్లో ఇల్లు లేదన్నందుకు వారం రోజుల్లోనే కంటైనర్తో ఇల్లు సెటప్ చేసిన అభ్యర్థి

ఎన్నికల సిత్రాలు: ఊళ్లో ఇల్లు లేదన్నందుకు వారం రోజుల్లోనే కంటైనర్తో ఇల్లు సెటప్  చేసిన అభ్యర్థి

సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఊరిలో డబ్బులు తీసుకుని ఓటేయకపోవడంతోనే ఓడిపోయానని సెల్ టవర్ ఎక్కాడు అభ్యర్థి. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థిని.. ఊళ్లో ఇల్లే లేదు.. పోటీ చేయడమేంటని కొందరు ప్రశ్నించడంతో ఏకంగా వారం రోజుల్లోనే ఇల్లు సెటప్ చేశాడు. అదికూడా హైబ్రిడ్ గా.. కంటైనర్ ఇల్లు నిర్మించి నోర్లు మూయించాడు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జోవుల కే గ్రామానికి చెందిన బోయిన్వాడ్ వినోద్ కుమార్ మహారాష్ట్ర లోని ధర్మాబాద్ లో స్థిరపడ్డారు. తాను పుట్టిన గ్రామానికి అభివృద్ధి చేయాలనీ ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాను. అయితే గ్రామస్తులలో కొందరు గ్రామంలో ఉండడానికి ఇల్లు లేకున్నా ఇలా పోటీ చేస్తారని ఆరోపించారు.

Also Read : ఓట్ల కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి

అలా  అనడంతో వినోద్ కుమార్ బాగా ఆలోచించి హైదరాబాద్ నుంచి ఒక కంటైనర్ లో ఏర్పాటు చేసిన ఇల్లును కొనుగోలు చేసి తన గ్రామంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. అదే ఇంట్లో ఉంటూ గ్రామంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను గ్రామస్తులు సర్పంచిగా  ఎన్నుకుంటే ఇంకా గ్రామానికి మరెన్నో అభివృద్ధి పనులతో పాటు గ్రామంలో పిల్లలకు విద్య, ప్రజలు వైద్యం అందేలా చూస్తానని అన్నారు.