V6 News

SMAT 2025: స్వింగ్‌తో భయపెట్టాడు: హ్యాట్రిక్‌తో చెలరేగిన నితీష్ కుమార్.. రజత్ పటిదార్ క్లీన్ బౌల్డ్

SMAT 2025: స్వింగ్‌తో భయపెట్టాడు: హ్యాట్రిక్‌తో చెలరేగిన నితీష్ కుమార్.. రజత్ పటిదార్ క్లీన్ బౌల్డ్

టీమిండియా ఆల్ రౌండర్, హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బౌలింగ్ లో రెచ్చిపోయాడు. శుక్రవారం (డిసెంబర్ 12) మధ్యప్రదేశ్ పై జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తో రెచ్చిపోయాడు. పేలవ ఫామ్ తో టీమిండియాలో చోటు కోల్పోయిన నితీష్.. డొమెస్టిక్ క్రికెట్ తో ఫామ్ లోకి వచ్చాడు. మధ్యప్రదేశ్ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ మూడో ఓవర్లో నితీష్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. మూడో ఓవర్ లో తొలి మూడు బంతులకు రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన నితీష్..చివరి మూడు బంతులకు వికెట్లను తీసుకున్నాడు. 

మూడో ఓవర్ నాలుగో బంతికి ఒక ఔట్ స్వింగ్ తో హర్ష్ గావాలిని బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన హర్‌ప్రీత్ సింగ్ ని ఒక అద్భుత ఇన్ స్వింగ్ తో పెవిలియన్ కు పంపాడు. చివరి బంతికి కెప్టెన్ రజత్ పటిదార్ ను బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ కట్ ఇవ్వాలని చూసిన పటిదార్ ఇన్ సైడ్ ఎడ్జ్ కావడంతో బంతి వికెట్లను గిరాటేసింది. నితీష్ ధాటికి హర్‌ప్రీత్ సింగ్, రజత్ పటిదార్ ఇద్దరూ కూడా గోల్డెన్ డకౌటయ్యారు. నితీష్ సూపర్ ఓవర్ తో మధ్యప్రదేశ్ 14 పరుగులకె మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన నితీష్ 17 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. 

నితీష్ హ్యాట్రిక్ తో విజృంచించినా ఆంధ్రకు ఓటమి తప్పలేదు. బౌలింగ్ లో రాణించినప్పటికీ బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది.ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ పై 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్రా 19. 1 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ప్లేయర్స్ శ్రీకర్ భరత్ (39), నితీష్ కుమార్ రెడ్డి (25) మినహాయిస్తే మిగిలినవారు విఫలమయ్యారు. స్వల్ప ఛేజింగ్ లో మధ్యప్రదేశ్ 17.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసి గెలిచింది. రిషబ్ చౌహన్ 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.