V6 News

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 ఫినాలే ఫైర్: భరణి కన్నీటి త్యాగం.. ఇమ్యూనిటీని తిరస్కరించిన తనూజ!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 ఫినాలే ఫైర్: భరణి కన్నీటి త్యాగం.. ఇమ్యూనిటీని తిరస్కరించిన తనూజ!

బుల్లి తెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేకు చేరువైంది. ఫైనలిస్ట్ రేసు కోసం హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత తీవ్రమైంది.ఈ వారం నామినేషన్ల విధానాన్ని పక్కనపెట్టి కంటెస్టెంట్లను నేరుగా ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేసేందుకు 'లీడర్ బోర్డు' టాస్క్‌ను ప్రవేశపెట్టాడు బిగ్ బాస్ . దీంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే కల్యాణ్ మొదటి ఫైనలిస్ట్‌గా స్థానాన్ని సంపాదించుకున్నాడు. రెండవ ఫైనలిస్ట్ కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది.

భరణి త్యాగం... 

రెండవ ఫైనలిస్ట్ స్థానం కోసం భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజనా మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. లీడర్ బోర్డులో తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా, నిన్నటి ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి పోటీ నుంచి తప్పుకోగా, ఈ రోజు భరణి నిష్క్రమించాల్సి వచ్చింది. పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చినందుకు తీవ్ర భావోద్వేగానికి లోయ్యారు భరణి.  తన దగ్గర ఉన్న పాయింట్లలో సగాన్ని తాను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తనూజకు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు.  ఆ మాట వినగానే తనూజ భరణి దగ్గరికి వెళ్తుంది.  భరణి త్యాగం ఒక్కసారిగా మిగతా హౌస్‌మేట్స్‌ను కలచివేసింది. .  భరణి ఇచ్చిన అదనపు స్కోర్, తనూజకు తుది పోరులో అదనపు బలంగా మారింది.

తనూజ తిరస్కరణ!

భరణి మద్దతు, తన సొంత పోరాట పటిమతో, చివరకు తనూజ మిగిలిన ఇమ్మాన్యుయేల్, సంజనాలతో ఆడిన గేమ్స్‌లో అద్భుతంగా రాణించి, రెండవ ఫైనలిస్ట్‌గా నిలిచినట్లు సమాచారం. అయితే, ఈ విజయం తర్వాత తనూజ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫైనల్స్‌లోకి నేరుగా అడుగుపెట్టే అవకాశాన్ని  ఆమె తిరస్కరించింది. "నాకు ప్రేక్షకుల అభిమానం ముఖ్యం. నేను డైరెక్ట్‌గా ఫైనల్స్‌కు వెళ్లను. ఈ వారం ప్రజల ఓట్లు నన్ను సేవ్ చేస్తేనే ఫైనల్స్‌కు వెళ్తాను అని సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, తనూజ ధైర్యం, ప్రేక్షకులపై ఆమెకు ఉన్న విశ్వాసం ఈ ఎపిసోడ్‌లో ఆమెకు మరింత ప్లస్ పాయింట్‌గా మారనుంది.

ALSO READ : 'అఖండ-2' టికెట్ల వివాదం

 ఎలిమినేషన్ ఉచ్చులో ఎవరు?

లీడర్ బోర్డులో తక్కువ స్కోర్ కారణంగా సుమన్ శెట్టి, భరణి ఫైనలిస్ట్ పోటీ నుంచి తప్పుకున్నారు. భరణికి బిగ్ బాస్ ఇచ్చిన అదనపు స్కోర్, మిగిలిన వారిని నామినేషన్ల నుంచి తప్పిస్తుందని సమాచారం. అయితే, ఫైనలిస్ట్ పోటీ నుంచి తప్పుకున్న సుమన్ శెట్టి, భరణి ఈ వారం ఎలిమినేట్ అవుతారా? లేదా అనేది హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వేచి చూడక తప్పదు. ఫినాలే రేస్ రసవత్తరంగా మారుతున్న ఈ సమయంలో, హౌస్‌లో ఎవరు నిలుస్తారు, ఎవరు నిష్క్రమిస్తారు అనేది వేచి చూడాలి..