సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 టీమిండియా ఓడిపోయింది. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కనీస పోటీ అవ్వకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో కనీస పోరాటం చూపించకుండా 51 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఓడింది. మొదట బౌలర్లు ఘోరంగా విఫలం కాగా.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా పెవిలియన్ బాట పట్టారు. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ చేసిన ఒక పని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత జితేష్ శర్మ భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ పాదాలను నమస్కరించాడు. హర్లీన్ దగ్గరగా నడిచి వస్తున్నపుడు జితేష్ తన చేతిలో ఉన్న గ్లోవ్స్ వదిలేసి ఆమె కాళ్ళు మొక్కాడు. జితేష్ భుజం తట్టి డియోల్ లేపింది. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. జితేష్ శర్మ చేసిన ఈ పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళా క్రికెటర్ పట్ల ఉన్న వినయాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడని పొగిడేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సన్మాన కార్యక్రమానికి హాజరైన ఈ టీమిండియా మహిళా బ్యాటర్.. ఈ సందర్భంగా మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చింది.
జితేష్ శర్మకు హర్లీన్ డియోల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది చెబుతున్నారు. డియోల్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడం విశేషం. ఇటీవలే భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉంది. వరల్డ్ కప్ లో మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 33.80 సగటుతో 188 పరుగులు చేసింది. దురదృష్టవశాత్తు ఆమెకు నాకౌట్ లలో ఛాన్స్ దక్కలేదు. జితేష్ శర్మ ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండు వన్డేల్లో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.తొలి టీ20లో 10 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన జితేష్.. రెండో టీ20లో 17 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికాపై రెండో టీ20లో టీమిండియా ఓడిపోయింది. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో ముగిసిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన టీమిండియాకు పరాభవం తప్పలేదు. మరోవైపు సౌతాఫ్రికా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి 51 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (90) బ్యాటింగ్ లో చెలరేగితే.. బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించారు.
Jitesh Sharma touched the feet of Harleen Deol 🙏 pic.twitter.com/89NXxFHqL1
— VIKAS (@Vikas662005) December 12, 2025

