
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సైబర్‌క్రైమ్ కేసుల్లో తెలంగాణ (1,629 కేసులు) నాలుగో స్థానంలో నిలిచింది. కర్నాటక (12,007 కేసులు), ఉత్తర్ ప్రదేశ్ (9,353), అస్సాం (1,989) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ యాక్ట్, 2000 ప్రకారం.. ఎన్సీఆర్బీ విడుదల చేసిన రిపోర్ట్‌లో గతేడాది హైదరాబాద్‌లో 1,300 సైబర్‌క్రైమ్ కేసులు నమోదయ్యాయని తేలింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే భాగ్యనగరంలో దాదాపు 70 శాతం సైబర్‌క్రైమ్ కేసులు పెరగడం గమనార్హం. వచ్చే కొన్ని సంవత్సరాల్లో సైబర్ నేరాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్, ట్రాన్సాక్షన్స్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడంతో సైబర్ క్రైమ్, మోసాలు పెరుగుతున్నాయని సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో పని చేస్తున్న ఓ పోలీసు చెప్పారు.