మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. తెలంగాణలో 3వేల981 పీజీ సీట్లు

మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. తెలంగాణలో 3వేల981 పీజీ సీట్లు
  • సర్కారు కాలేజీల్లో 1,694.. ప్రైవేట్, డీమ్డ్‌‌‌‌‌‌‌‌లో 2,287
  • దేశవ్యాప్తంగా 63,177 సీట్లకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆమోదం
  • సీట్ల పెంపు, కొత్త కోర్సులపై మరో జాబితా.. త్వరలో పీజీ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 విద్యా సంవత్సరానికి 3,981 పీజీ మెడికల్ సీట్లు ఖరారయ్యాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,694 సీట్లు ఉండగా.. ప్రైవేట్, డీమ్డ్ కాలేజీల్లో 2,287 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 37కి పైగా కాలేజీల్లో 692 పీజీ కోర్సులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ) ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 10,756 కోర్సుల్లో 63,177 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ తెలిపింది. 

వీటిలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో 33,088, ప్రైవేట్ కాలేజీల్లో 21,892, డీమ్డ్ వర్సిటీల్లో 8,197 సీట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 29 నాటికి ఉన్న అనుమతుల ఆధారంగా సీట్ మ్యాట్రిక్స్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సీట్ల పెంపు, కొత్త కోర్సుల దరఖాస్తులను పరిశీలించి మరో జాబితా విడుదల చేస్తామని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఎంఏఆర్‌‌‌‌‌‌‌‌బీ తెలిపాయి. కాలేజీలు ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆమోదించిన సీట్లకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ఒక్క సీటు ఇచ్చినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సీట్లు..

ప్రభుత్వ కాలేజీల్లో ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సీట్లు దక్కాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో గైనకాలజీ (ఓబీజీ), పీడియాట్రిక్స్‌‌‌‌‌‌‌‌లో చెరో 60 సీట్లు, జనరల్ సర్జరీ, అనస్థీషియాలో చెరో 40 సీట్లు ఖరారయ్యాయి. ఆప్తాల్మాలజీ 34, జనరల్ మెడిసిన్ 28, ఆర్థోపెడిక్స్ 18, రేడియో డయాగ్నోసిస్‌‌‌‌‌‌‌‌ లో 16 సీట్లు ఖరారయ్యాయి. గాంధీలో ఓబీజీకి 25, జనరల్ మెడిసిన్, సర్జరీలో చెరో 20 సీట్లు వచ్చాయి. అనస్థీషియా 17, పీడియాట్రిక్స్‌‌‌‌‌‌‌‌ కు 15 సీట్లు కేటాయించారు. కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌కు 22, సర్జరీ, ఓబీజీకి చెరో 19 సీట్లు, పీడియాట్రిక్స్ 16 సీట్లు కేటాయించారు.

 సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో నిమ్స్‌‌‌‌‌‌‌‌కు డీఎం నెఫ్రాలజీలో 10, కార్డియాలజీ, న్యూరాలజీలో చెరో 8, ఎంసీహెచ్ సీటీవీఎస్, న్యూరోసర్జరీలో చెరో 6 సీట్లు వచ్చాయి. సనత్‌‌‌‌‌‌‌‌నగర్ ఈఎస్‌‌‌‌‌‌‌‌ఐసీతో పాటు నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, సూర్యాపేట, రామగుండం ప్రభుత్వ కాలేజీలతోపాటు ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ పీజీ సీట్లు ఉన్నాయి. 

ప్రైవేట్, డీమ్డ్ కాలేజీల్లో మల్లారెడ్డి సంస్థలకు 299 సీట్లు ఉండగా.. అపోలో, కామినేని, డెక్కన్, మమత, ప్రతిమ, ఎస్వీఎస్, భాస్కర్, మెడిసిటీ తదితర కాలేజీల్లో 1,988 సీట్లు ఉన్నాయి. సీట్ల సంఖ్య లేదా కాలేజీల వివరాల్లో తప్పులుంటే కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌కు ముందే [email protected], [email protected] ఈ-మెయిల్ చిరునామాలకు ఫిర్యాదు చేయాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆదేశించింది. త్వరలోనే పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.