V6 News

Telangana Global Summit: రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు..తెలంగాణ చరిత్రలోనే రికార్డు..

Telangana Global Summit: రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు..తెలంగాణ చరిత్రలోనే రికార్డు..
  • గ్లోబల్​ సమిట్​ వేదికగా కుదిరిన ఒప్పందాలు
  • రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు.. తరలివచ్చిన దిగ్గజ కంపెనీలు
  • తొలిరోజు రూ. 2,43,000 కోట్ల పెట్టుబడులు
  • రెండో రోజు అత్యధికంగా రూ. 3,32,000 కోట్లు
  • ఒక్క ఇన్‌ఫ్రాకీ నుంచే రూ. 70 వేల కోట్ల డేటా పార్క్
  • విద్యుత్ రంగంలోనే దాదాపు రూ. 3 లక్షల కోట్లు
  • పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, 
  • క్రీడా రంగాల్లోనూ భారీ ప్రాజెక్టులు
  • లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు.. 
  • సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంవోయూలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమిట్​లో ఏకంగా రూ. 5 లక్షల 75 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు సోమవారం రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. రెండో రోజు అది మరింత పెరిగింది. మంగళవారం ఒక్కరోజే రూ. 3 లక్షల 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్​ రంగం సింహభాగంలో నిలిచింది. జెన్‌కో, రెడ్‌కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే  దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

విద్యుత్​ రంగం.. ‘పవర్’ ఫుల్

  • పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 50 వేల కోట్ల భారీ పెట్టుబడి
  • జీటీటీసీఐ ట్రేడ్ ఛాంబర్: థోరియం మైనింగ్, క్లీన్ ఎనర్జీ కోసం రూ. 50 వేల కోట్లు
  • యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్: విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు రూ. 31,500 కోట్లు
  • రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌‌‌‌ఈసీ): రూ. 31,198 కోట్లు
  • గ్రీన్‌‌‌‌కో ఎనర్జీస్: పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల కోసం రెండు విడతల్లో రూ. 29,800 కోట్లు
  • ఏఎం గ్రీన్: ఇ-మెథనాల్, బయో రిఫైనరీల కోసం రూ. 18,000 కోట్లు
  • ఎకోరెన్: 1500 మెగావాట్ల ప్రాజెక్టులకు రూ. 16,000 కోట్లు
  • బెకెమ్ ఇన్‌‌‌‌ఫ్రా: సోలార్, స్టోరేజ్ ప్లాంట్ల కోసం రూ. 14,000 కోట్లు
  • అమర్ ఇండియా: 2000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కోసం రూ. 12,500 కోట్లు
  • మై హోమ్ పవర్: రూ. 7,000 కోట్లు
  • ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్: సోలార్, పంప్డ్ స్టోరేజ్ కోసం రెండు ఒప్పందాల ద్వారా
  • రూ. 10,250 కోట్లు
  • అతిరథ్ హోల్డింగ్స్: బయోగ్యాస్ ప్లాంట్ల కోసం రూ. 4,000 కోట్లు
  • సిద్దార్థ్ ఇన్‌‌‌‌ఫ్రాటెక్: రూ. 5,600 కోట్లు
  • సెరులియన్ ఎనర్జీ: రూ. 5,600 కోట్లు
  • శ్రీ సురాస్ ఇండస్ట్రీస్: రూ. 3,500 కోట్లు
  • ఎస్ఎల్‌‌‌‌ఆర్ సురభి పవర్: సోలార్ ప్యానెల్ తయారీకి రూ. 3,000 కోట్లు
  • యునైటెడ్ టెలికామ్స్: రూ. 2,500 కోట్లు
  • సోలానిక్స్ పవర్: రూ. 2,400 కోట్లు
  • ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల కోసం రూ. 1,600 కోట్లు
  • హైజెన్‌‌‌‌కో గ్రీన్ ఎనర్జీస్: గ్రీన్ హైడ్రోజన్ కోసం రూ. 1,250 కోట్లు

డేటా సెంటర్ల హబ్‌‌‌‌గా తెలంగాణ 

  • డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వచ్చాయి.
  • ఇన్‌‌‌‌ఫ్రాకీ డిసి పార్క్స్: 150 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా పార్క్ కోసం రూ. 70,000 కోట్ల సంచలనాత్మక పెట్టుబడి
  • జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: డేటా సెంటర్ల కోసం రూ. 9,000 కోట్లు (2 వేల ఉద్యోగాలు)
  • ఏజీపీ గ్రూప్: 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం రూ. 6,750 కోట్లు
  • ఆక్వెలాన్ నెక్సస్: 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్
  • పర్వ్యూ గ్రూప్: 50 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ (3 వేల ఉద్యోగాలు)
  • బ్లాక్‌‌‌‌స్టోన్: ఆసియా డేటా సెంటర్లు,లాజిస్టిక్స్ పార్కుల్లో పెట్టుబడులకుఆసక్తి

ఫార్మా - లైఫ్ సైన్సెస్.. భారీ విస్తరణ

  • ఔషధ రంగంలో హైదరాబాద్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
  • బయోలాజికల్ ఈ: టీకాలు, పరిశోధన అభివృద్ధి కోసం రూ. 3,500 కోట్లు(3 వేల ఉద్యోగాలు)
  • అరబిందో ఫార్మా: విస్తరణ కోసంరూ. 2,000 కోట్లు (3 వేల ఉద్యోగాలు)
  • హెటెరో: మందుల తయారీ యూనిట్ల కోసం రూ. 1,800 కోట్లు (9 వేల ఉద్యోగాలు)
  • గ్రాన్యూల్స్ ఇండియా:రూ. 1,200 కోట్లు (3 వేల ఉద్యోగాలు)
  • భారత్ బయోటెక్:రూ. 1,000 కోట్లు (200 ఉద్యోగాలు)
  • బయోవరం: టిష్యూ ఇంజినీరింగ్కోసం రూ. 250 కోట్లు
  • విజ్జీ హోల్డింగ్స్: డిజిటల్ ట్విన్ హెల్త్ పరిశోధన కేంద్రం
  • అనలాగ్ ఏఐ: గ్లోబల్రీసెర్చ్ ల్యాబ్

పర్యాటకానికి వెన్నుదన్ను

  • పర్యాటక రంగంలో మొత్తం రూ. 7,045 కోట్ల పెట్టుబడులు రాగా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా40 వేల మందికి ఉపాధి లభించనుంది.
  • ఫుడ్ లింక్: రూ. 3,000 కోట్లు
  • డ్రీమ్‌‌‌‌వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్:రూ. 1,000 కోట్లు
  • సారస్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్: రూ. 1,000 కోట్లు
  • అట్మాస్ఫియర్ కోర్ (మాల్దీవులు):రూ. 800 కోట్లు
  • రూ. 300 కోట్ల క్లబ్: ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్), పోలిన్ గ్రూప్ (టర్కీ), మల్టీవర్స్ హోటల్స్, శ్రీ హవిషా హాస్పిటాలిటీ.. ఒక్కో సంస్థ రూ. 300 కోట్లు.
  • కేఈఐ గ్రూప్: రూ. 200 కోట్లు
  • రిధిరా గ్రూప్: రూ. 120 కోట్లు
  • ఇతర సంస్థలు: సలామ్ నమస్తే, విశాఖ రిక్రియేషన్ (రూ. 25 కోట్లు).
  • ఐఫా ఉత్సవం: ఈవెంట్ల ద్వారా రాష్ట్రానికిరూ. 550–600 కోట్ల ఆర్థిక లబ్ధి.

క్రీడలు, వినోదం.. గ్లోబల్ హబ్

  • అజయ్ దేవగన్ స్టూడియో: పీపీపీ మోడల్‌‌‌‌లో ఫిల్మ్ ఎకోసిస్టమ్ (స్టూడియోలు, వీఎఫ్ఎక్స్) అభివృద్ధి
  • ఫీఫా: హైదరాబాద్‌‌‌‌లో ప్రపంచ స్థాయి ఫుట్‌‌‌‌బాల్ అకాడమీ ఏర్పాటు
  • అంతర్జాతీయ ఈవెంట్లు: 2026లో హాకీ మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్ (8 దేశాలు),
  • ఏషియా రోయింగ్ ఛాంపియన్‌‌‌‌షిప్ (18 దేశాలు), ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్
  • జీఎంఆర్: శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి
  • గ్లోబల్ సెంటర్లు: జ్యూరిక్ ఇన్షూరెన్స్, సిఐబిసి (కెనడియన్ బ్యాంక్), మాక్సిమస్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌‌‌‌లో తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి.
  • రియల్ ఎస్టేట్: సత్త్వ, బ్రిగేడ్, సుమధుర గ్రూపులతో టౌన్‌‌‌‌షిప్‌‌‌‌లు, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై చర్చలు