
హైదరాబాద్: శ్రీనిధి విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఎస్‌యూ టీపీజీఎల్–2025) ఈ నెల 25 నుంచి మొదలు కానుంది. దీనికి సంబంధించిన ట్రోఫీని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. మొత్తం 16 జట్ల కోసం 192 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. లీగ్ మ్యాచ్‌లు ప్లే ఫార్మాట్‌లో జరుగుతాయి. తర్వాత రెండు నాకౌట్స్, గ్రాండ్ ఫైనల్ ఉంటుంది.
గ్రూప్–ఎలో ఆటమ్ చార్జర్స్, టీమ్ టీ ఆఫ్, డెక్కన్ నవాబ్స్, లండన్ రాయల్స్, కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్, ఎంవైకే స్ట్రయికర్స్, హెల్దీ ఫెయిర్‌వేస్, లైఫ్‌స్పాన్ లయన్స్.. గ్రూప్–బిలో గన్నర్స్ వికారా, స్ట్రాజ్, హైదరాబాద్ స్లేయర్స్, మావెరిక్స్, శ్రీనిధి థండర్ బోల్ట్స్, వ్యాలీ వారియర్స్, కేఎల్‌ఆర్ కింగ్స్, విశ్వ సముద్ర గోల్డెన్ ఈగల్స్ పోటీపడుతున్నాయి. ఈ లీగ్ నిర్మాణాత్మక, పారదర్శక, సమగ్ర గోల్ఫ్‌కు ప్రతీకగా నిలుస్తుందని కమిషనర్ సంజయ్ అన్నారు. ప్లేయర్లు, స్పాన్సర్లు, ఫ్యాన్స్ ఒక చోట చేరి స్నేహం, కృతజ్ఞతతో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఏ) స్ఫూర్తిని కాపాడతారన్నారు. ఇండియాలోని అత్యంత గౌరవనీయమైన లీగ్‌ల్లో ఒకదానిగా మార్చడం కోసం కట్టుబడి ఉన్న జట్టు యజమానులు, స్పాన్సర్లు, హెచ్‌జీఏ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో గోల్ఫ్ ఉత్సాహాన్ని టీపీజీఎల్ ప్రతిబింబిస్తుందని, ఇది ఆటను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తుందని హెచ్‌జీఏ ప్రెసిడెంట్ బీవీకే రాజు అన్నారు.