ఇంటర్ కాలేజీలకు 3 రోజులు సంక్రాంతి సెలవులు

ఇంటర్ కాలేజీలకు 3 రోజులు సంక్రాంతి సెలవులు

హైదరాబాద్ :  ప్రభుత్వ,ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ విద్యామండలి సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 14 నుండి 16 వరకు మూడు రోజల పాటు సెలవులను ప్రకటించింది. 17 న కాలేజీలను రీ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెలవుల రోజుల్లో  ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో స్కూళ్లకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి 18న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు  జనవరి14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోనున్నారు.