జనవరి ఒకటి.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

జనవరి ఒకటి.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సర సెలవులను ప్రకటించింది.  జనరల్ హాలిడేగా ప్రకటించింది.  2024 జనవరి 1న కొత్త సంవత్సరం రోజున ప్రభుత్వ హాలిడే ప్రకటించడంతో   2024 ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల  ఆదేశాలు

ప్రభుత్వం  న్యూ ఇయర్ కు హాలిడే ప్రకటించడంతో   హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పోలీసులు శాంతియుతంగా వేడుకలు జరుపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలకు వెళ్లేవారు , పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు  ఆదేశాలు జారీ చేశారు.

అన్ని క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు, పబ్‌లు,  హోటళ్లు తెల్లవారుజామున 1 గంట వరకు పార్టీలు జరుపుకోవాలంటే.. ముందుగా పోలీసుల అనుమతిని పొందాలి. అంతే కాకుండా న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.