తుపాకులగూడానికి ఎన్వోసీ ఇవ్వండి.. చత్తీస్​గఢ్​కు తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి

తుపాకులగూడానికి ఎన్వోసీ ఇవ్వండి.. చత్తీస్​గఢ్​కు తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీకి ఎన్వోసీ ఇవ్వాలని చత్తీస్​గఢ్​ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇరిగేషన్​ స్పెషల్​ సీఎస్​ రజత్​కుమార్​ మంగళవారం చత్తీస్​గఢ్​ఇరిగేషన్​ సెక్రటరీ అంబగలన్​తో ఫోన్​లో మాట్లాడారు. 

తుపాకులగూడెంలో 80 మీటర్ల దాకా నీటిని నిల్వ చేసినా  చత్తీస్​గఢ్​లో ఎలాంటి ముంపు తలెత్తదని ఇటీవల టెక్నికల్​ ఆఫీసర్​ల ఫీల్డ్​ విజిట్​లోనూ నిర్ధారణ అయ్యిందని గుర్తు చేశారు. టెక్నికల్​ఆఫీసర్​సూచనల మేరకు బ్యారేజీలో 80 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు నో అబ్జక్షన్​సర్టిఫికెట్​ఇవ్వాలని చత్తీస్​గఢ్​ సర్కార్​ను కోరారు. 83 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తేనే చత్తీస్​గఢ్​లో  ముంపు ఉంటుందని తెలిపారు. 

బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున ఈ సీజన్​నుంచే నీటిని నిల్వ చేయాల్సి ఉందని వివరించారు. చత్తీస్​గఢ్​ ప్రభుత్వం ఎన్వోసీ ఇస్తే నీటి నిల్వకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్​ఇస్తుందని వివరించారు.