ఇంటర్‌ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

ఇంటర్‌ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్ కు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది.  ఇంటర్‌ మొదటి సంవత్సరం బ్యాక్ లాగ్స్ ఉంటే 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని.. సెకండియర్‌లోనూ ఆ సబ్జెక్టులకు 35 శాతం మార్కులను కేటాయించనున్నారు.

ప్రైవేట్ గా పరీక్ష ఫీజు కట్టిన విద్యార్ధులకు 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.