
హైదరాబాద్, వెలుగు: సర్కారీ డిగ్రీ కాలేజీల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పది మందిలోపు స్టూడెంట్స్ ఉన్న కోర్సులను ఎత్తివేయాలని కాలేజీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ఆ కోర్సుల్లో చేరిన స్టూడెంట్స్‌కు అదే కాలేజీల్లో ఇతర కోర్సుల్లో చేరేందుకు అవకాశమివ్వాలని, లేదంటే దగ్గర్లోని సర్కారు కాలేజీలో ఆ కోర్సు ఉంటే దాంట్లో చేర్పించాలని సూచించారు. ఈ నిర్ణయంతో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో పలు కోర్సులు మూతపడే అవకాశముంది.