
అంగన్ వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీ సిబ్బంది రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచింది. అంతేగాకుండా అంగన్ వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లక్ష నుంచి రూ. 2లక్షలకు .. అంగన్ వాడీ హెల్పర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లు 60 ఏళ్ల వయసు దాటాకా వీఆర్ఎస్ తీసుకుంటే ఈ బెన్ఫిట్స్ వర్తించనున్నాయి.
ఇటీవలే అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లకు పదవి విరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రతిపాదించిన ఫైలును ఆర్థిక శాఖ ఆమోదించగా..మే 31న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 37580 పైగా అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రతి సెంటర్ కు ఒక టీచర్, హెల్పర్ పనిచేస్తున్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 70 వేల మంది సిబ్బందికి అంగన్ వాడీ సెంటర్లలో పనిచేస్తున్నారు.
ఇటీవలే తెలంగాణలో పనిచేస్తున్న 3,989 మంది మినీ అంగన్ వాడీ టీచర్లకు మెయిన్ అంగన్ వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది.ఈ ప్రమోషన్ తో మినీ అంగన్ వాడీ టీచర్లకు రూ. 13,650 వేతనం వస్తుంది.