టీచర్ల కోతకు జీవో జారీ

టీచర్ల కోతకు జీవో జారీ

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి జీఓ 25ను జారీచేసింది. ప్రాథమిక పాఠశాలలో 20 మందిలోపు విద్యార్థులుంటే ఒకరు టీచర్ తప్పనిసరని చెప్పింది. 21 నుంచి 60 మంది వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు.. 61 నుంచి వంద మంది విద్యార్థులంటే ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలని స్పష్టం చేసింది. వంద మందికి పైబడిన పాఠశాలకు ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని నిర్ణయించారు. ఉన్నత పాఠశాలల్లో 220 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. ఆ పై ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదలచేశారు. కాగా.. పాఠశాలలో 50 మంది విద్యార్థులుంటేనే ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూపీఎస్ లోని 6, 7 తరగతుల్లో వంద మంది విద్యార్థులకు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు పండిట్లు ఉండాలని చెప్పింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత అంటే 2015 తర్వాత మరోసారి ఉపాధ్యాయుల రేషనలైజేషన్ కు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో వేలాదిమంది ఉపాధ్యాయులు రోడ్డున పడనున్నారు.