మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ

మహిళలకు ఉచిత  డ్రైవింగ్ శిక్షణ

సెర్ప్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని మంత్రి సీతక్కపేర్కొన్నారు. ఎంవోడబ్ల్యూవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళలకు డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో ఉచిత శిక్షణపై కార్యాచరణ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న సరితను మంత్రి శాలువాతో సత్కరించి అభినందించారు. 

సెర్ప్ ద్వారా మహిళలకు బస్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో ఉచిత శిక్షణ ఇస్తామని సీతక్క అన్నారు. సరితను ఆదర్శంగా తీసుకుని మహిళలు డ్రైవింగ్ తోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఆసక్తిగల మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించి ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను రిక్రూట్ చేసేలా నిర్ణయం తీసుకుంటామని సీతక్క పేర్కొన్నారు.