ఆ డబుల్ బెడ్రూం ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్లోకి మార్చండి : సీఎస్ ఉత్తర్వులు

ఆ డబుల్ బెడ్రూం ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్లోకి మార్చండి : సీఎస్ ఉత్తర్వులు
  • కలెక్టర్లకు సీఎస్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లనింటినీ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై శుక్రవారం సీఎస్ జీవో జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం ఏయే విభాగాల పరిధిలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయనే విషయాన్ని పరిశీలించి, వాటన్నింటినీ హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని జిల్లాల కలెక్టర్ల ను సీఎస్ ఆదేశించారు. 

గత ప్రభుత్వం హౌసింగ్ డిపార్ట్​మెంట్ ను ఆర్ అండ్​ బీలో విలీనం చేసింది. దీంతో జిల్లాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల  నిర్మాణ బాధ్యతలను పంచాయతీ రాజ్, ఆర్ అండ్​బీలకు ప్రభుత్వం ఆప్పగించింది. ఇప్పుడు ఆ ఇండ్లను హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేయాలని సీఎస్ ఆదేశించారు.