మైనార్టీల బాగోగులు చూసేది మేమే.. ఇఫ్తార్ విందులో కేసీఆర్

మైనార్టీల బాగోగులు చూసేది మేమే..  ఇఫ్తార్ విందులో కేసీఆర్

హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా  హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడిన సీఎం.. ముస్లిం సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమాలు చేపట్టిందని అన్నారు. గత 9 ఏళ్లలో ముస్లింల  సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం12 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.

 గత ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోలేదని,  మైనార్టీల బాగోగులు చూసింది తామేనని చెప్పారు.  తాము  అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడుతున్నామని సీఎం చెప్పారు.  మన రాష్ట్ర ఆదాయం పెరిగిందన్న  కేసీఆర్  ..  తెలంగాణ దరిదాపుల్లో కూడా మరో రాష్ట్రం లేదని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు.  

దేశం కూడా మన రాష్ట్రం లాగే అభివృద్ధి చెందాలన్నదే తన  లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా మైనార్టీల గురుకుల విద్యార్థులకు సీఎం కానుకలు అందజేశారు.   ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.