గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ/ జనగామ అర్బన్/ పాల్వంచ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీట వేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో నిర్మించిన నూతన స్విమ్మింగ్ పూల్‌ను కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు పుట్టినిల్లని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వరంగల్ కలెక్టరేట్, హనుమకొండ బాలసముద్రంలో హాకీ దిగ్గజం ద్యాన్చంద్జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్లు సత్యశారద, చాహత్బాజ్పై ద్యాన్చంద్ఫొటోకు నివాళులర్పించారు. జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ధ్యాన్చంద్ఫొటోకు నివాళులర్పించి, క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. క్రీడా దినోత్సవంలో భాగంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసానిలో ఐటీడీఏ స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.చందన, పీవో బి.రాహుల్ ప్రారంభించారు
