ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదొన్నతి.. డీజీలుగా ప్రమోషన్

ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదొన్నతి.. డీజీలుగా ప్రమోషన్

రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా, రాజీవ్ రతన్, జితేందర్ లకు డీజీగా పదోన్నతి కల్పిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ పోలీస్ హౌంజిగ్ కార్పోరేషన్ ఎండీగా ఉన్నారు. అలాగే జితేందర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి నెలలో ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. అంబర్ కిషోర్ ఝా,  రెమా రాజేశ్వరీ, ఎల్ ఎస్ చౌహాన్, కే. నారాయణ్ నాయక్,  పరిమల హనా నూతన్ జాకబ్, ఎస్, రంగారెడ్డిలను డీఐజీగా ప్రమోట్ చేసింది. 

అదేవిధంగా 2023 జూన్ 10వ తేదీన 18 మంది అడిషనల్ ఎస్పీలను  ఎస్పీలుగా  ప్రభుత్వం పదోన్నతిని కల్పించింది. మరో వైపు 37 మంది డీఎస్పీలను అడిషినల్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చింది.  2023 మే నెలలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఐజీలుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది.