జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచిన ప్రభుత్వం

 జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసుతో ప్రభుత్వం దిగివచ్చింది. వారికి స్టైఫండ్ పెంచాలని నిర్ణయించింది. హౌస్ సర్జన్లతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న డాక్టర్లకు 15 శాతం పెంచాలని నిర్ణయించింది. 15 శాతం వేతనం పెంచాలని, 10 శాతం ఇన్ సెంటివ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. రెండు వారాల్లో తమ సమస్యను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది. 
స్నేహ సోమారెడ్డి అనే జూనియర్ డాక్టర్ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో నిరంతర సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు గత నాలుగు నెలల నుండి వేతనాలు అందడం లేదని.. కరోనా వేళ డ్యూటీలు చేస్తున్న వైద్యులకు అనేక రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే ఇక్కడ తమకు జీతాలే లేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  మా ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరగా మంత్రి కేటీఆర్  ట్విట్టర్ లో సానుకూలంగా స్పందించారు.హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను.. వారికి 15 శాతం పెంాచాలని హెల్త్ సెక్రెటరీకీ సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని తెలిపారు. ఇవాళే జీవో కూడా విడుదలవుతుందని హామీ ఇచ్చారు.