- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న 1,125 మంది కాంట్రాక్టు సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)ను సర్కారు రెన్యువల్ చేసింది. ఏప్రిల్ 1నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఏడాది కాలం పాటు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టు టీచర్లకు నెలకు రూ. 31,040 వేతనం ఇస్తున్నారు.
వారి సేవలను రెన్యువల్ చేయడంతో వేతనాలూ అందనున్నాయి. కాగా, డీఎస్సీ 2008లో సెకెల్టెడ్ అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిని రెన్యువల్ చేయకపోవడంతో ఏప్రిల్ నుంచి జీతాలు రావడం లేదు. దీనికి సంబంధించి ‘డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్ల జీతాలు పెండింగ్ ’ హెడ్డింగ్‌తో వెలుగులో కథనం కూడా ప్రచురితమైంది. దీనిపై సర్కారు స్పందించింది.
