
- ఒక్కో బడికి 2 లక్షల దాకా నిధులు
హైదరాబాద్, వెలుగు: పిల్లలు లేక మూతబడి ఇటీవల తెరుచుకున్న బడులకు సర్కారు నిధులు ఇవ్వనున్నది. ఆయా బడులకు కలర్స్ వేయడంతో పాటు ఇతర వసతుల కోసం సుమారు రూ.2 లక్షల దాకా ఫండ్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. గతంలో మూతబడి ఈ ఏడాది సుమారు 140 దాకా బడులు తెరుచుకున్నాయి.
వీటికి మరమ్మతులు చేయడంతో పాటు గోడలకు కలర్స్ వేయాలని, ఇతర ఫర్నిచర్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2 వారాల క్రితం 23 జిల్లాల్లో 138 బడులు రీఓపెన్ కాగా.. వాటిలో 2 వేల మంది దాకా చేరారు.