ఇంటర్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డె మీల్స్పై లెక్చరర్ల హర్షం..సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం 

ఇంటర్ లో బ్రేక్ ఫాస్ట్, మిడ్డె మీల్స్పై లెక్చరర్ల హర్షం..సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం 

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లెక్చరర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ విద్యా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో లంచ్ సమయంలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్, సిబ్బంది కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేశారు.

హైదరాబాద్ స్పాట్ కేంద్రంలో ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ పి.మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అత్యంత కీలకమని, దశలో వారికి పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమన్నారు. పుస్తకాలు, యూనిఫాంలు, తాగునీటి వసతులతో ఇంటర్ విద్యావ్యవస్థ దశ-దిశ మారబోతోందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్​లో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.