వర్షాలు విస్తారంగా కురవాలని.. ఎల్లుండి( ఆగస్టు10న) సాగర్లో వరుణయాగం

వర్షాలు విస్తారంగా కురవాలని.. ఎల్లుండి( ఆగస్టు10న) సాగర్లో వరుణయాగం
  • మహా క్రతువుకు యాదగిరిగుట్ట ఆలయ అర్చకుల ముహూర్తం
  • మంత్రి ఉత్తమ్ ​నేతృత్వంలో నిర్వహణ.. హాజరుకానున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ/యాదగిరిగుట్ట/హాలియా, వెలుగు: రాష్ట్రంపై ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం పడకుండా విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో కళకళలాడాలని, కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని ఆశిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీరంలో ప్రభుత్వం వరుణయాగం చేయనుంది. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచన మేరకు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో, యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 10న ఈ మహా క్రతువును నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, సిద్ధాంతులు దీనికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ యాగంలో మొత్తం 11 హోమ గుండాల వద్ద 108 మంది రుత్వికులు, వేద పండితులు పూజలు చేయనున్నారు. ఈ క్రతువుకు సాగర్ తీరంలోని విజయవిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదిక కానుంది. 

శుక్రవారం మంత్రి ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారని చెప్పారు. ఈ నెల10న మధ్యాహ్నం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ప్రకృతి అనుగ్రహం పొంది, రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో ఈ పుణ్యకార్యాన్ని చేపడుతున్నట్లు ఉత్తమ్​పేర్కొన్నారు. రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహిస్తున్న ఈ మహోన్నత యాగంలో ప్రజలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీర్వచనాలు పొందాలని ప్రజలను కోరారు.

యాగ ఏర్పాట్ల పరిశీలన

నాగార్జునసాగర్ సమీపంలోని విజయవిహార్ వద్ద నిర్వహించనున్న వరుణ యాగం ఏర్పాట్లను శుక్రవారం నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ పరిశీలించారు. యాగస్థలి, ప్రవచనశాల, యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్‌‌‌‌, ఇతర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. 

యాగశాల ప్రదేశం, బారీకేడ్లు, పగోడాల ఏర్పాటు, ప్రవచన వేదిక, టెంట్లు, ఎల్ఈడీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, యాగం నిర్వహించేందుకు వచ్చే రుత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎంతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్న దృష్ట్యా యాగాన్ని తిలకించేందుకు అవసరమయ్యే ఏర్పాట్లతో పాటు, బందోబస్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.