రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సుధాకర్, శ్రావణ్ కుమార్ పిటిషన్లు వేశారు. పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు... వరదల కోసం కంట్రోల్ రూమ్స్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 

కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను రక్షించాలని ఆదేశించింది. ఇప్పటివరకు డిజాస్టర్ చట్టప్రకారం ఎంతమందిని రక్షించారని అడిగింది. వర్షాలు, వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఈ రోజు 2023 జులై 31 సోమవారం పూర్తి నివేదికను సమర్పించనుంది.